ట్రాక్టర్‌ పైనుంచి పడి ఇద్దరు మహిళలు మృతి (వీడియో)

AP: బాపట్ల (D), అద్దంకి (M), తిమ్మాయపాలెం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. స్వరూపారాణి (45), వేము నర్సులు (50) ఇద్దరు పొలం పనులకు వెళ్లేందుకు ట్రాక్టర్‌ ఎక్కారు.  కొంత దూరం వెళ్లాక ట్రాక్టర్ అదుపు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో ఇద్దరు మహిళలు కింద పడి పోగా, వారిపైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్