పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఇద్దరు మహిళలు శివాలయంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. మూడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ, తమ భర్తల వద్ద విడాకులు తీసుకొని.. అనంతరం పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు వీరి ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.