TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ హైట్స్ వద్ద మూసీనదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఓల్డ్ సిటీకి చెందిన ఆరుగురు యువకులు మూసీవద్దకు వెళ్లారు. స్నానం చేస్తున్న క్రమంలో మహమ్మద్ రహన్ (16), సోహెల్ (16) నీటిలో మునిగిపోయారు. గమనించిన మరో ఇద్దరు పరారయ్యారు. గల్లంతైన యువకుల కోసం డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి రాజేంద్రనగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.