మోదీకి ఫోన్ చేసిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

ప్ర‌ధాని మోదీతో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ టెలిఫోన్‌లో మాట్లాడారు. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యా అగ్ర నాయ‌క‌త్వాన్ని క‌లిసేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని మోదీతో జెలెన్‌స్కీ చెప్పారు. త‌క్ష‌ణ కాల్పుల విర‌మ‌ణ‌తో  యుద్ధానికి అంతం ప‌ల‌కాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇరు దేశాల వివాదాన్ని శాంతియుతంగా ప‌రిష్క‌రించేందుకు భార‌త్ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జెలెన్‌స్కీతో ప్ర‌ధాని మోదీ అన్నారు.

సంబంధిత పోస్ట్