ఆడపడుచుల వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్

TG: సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆడపడుచుల వేధింపులు తట్టుకోలేక వివాహిత దివ్యశ్రీ (32) శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దివ్యశ్రీ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ఆస్తుల పంపకానికి సంబంధించి ఇద్దరు ఆడపడుచులు తరచూ వేధించినట్లు సమాచారం. భర్త మల్లికార్జున్‌ ఇంటికి వచ్చినప్పడు ఆమె విగతజీవిగా ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్