ఎస్ఐ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య (వీడియో)

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన సోమ నర్సమ్మ (50) అనే మహిళ దొంగతనానికి పాల్పడినట్లు, ఇంట్లో బంగారు ఆభరణాలు, డబ్బు పోగొట్టుకున్నట్లు తన బావ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ క్రాంతికుమార్ ఆమెను స్టేషన్‌కు పిలిపించి వేధించాడు. 'నువ్వే దొంగతనం చేశావు, ఒప్పుకో' అని బెదిరించి, అవమానించడంతో తట్టుకోలేక నర్సమ్మ అదే రాత్రి ఉరితీసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసుల వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని విచారం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్