ఉత్తరప్రదేశ్‌లోని బండాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అన్నయ్య మరణం తట్టుకోలేని చెల్లి చేతిపై సూసైడ్ నోటి రాసి ఆత్మహత్య చేసుకుంది. పరాస్ గ్రామానికి చెందిన శిఖ(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ‘నా మృతదేహాన్ని అభిషేక్ దగ్గరే దహనం చేయండి. నాకు బతకాలని లేదు’ అని నోట్ రాసి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి మృతి చెందింది. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.