తండ్రి మరణాన్ని మరిచిపోలేక.. కూతురు ఆత్మహత్య

కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గౌరీ బిద్నూర్‌ ప్రాంతానికి చెందిన స్వర్ణ(22) బెంగళూరులోని మహారాణి కాలేజీలో MSc చదువుతోంది. అయితే 3 నెలల క్రితం ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో స్వర్ణ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం హాస్టల్ గదిలో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో హాస్టల్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వర్ణ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్