దేశంలో నిరుద్యోగిత రేటు మే నెలలో 5.6 శాతానికి చేరింది. ఇది ఏప్రిల్‌లో 5.1 శాతంగా ఉంది. మహిళలలో నిరుద్యోగిత రేటు మేలో 5.8%గా నమోదైంది. 15-29 ఏళ్ల వయస్సు గల యువతలో నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో 13.8%గా ఉండగా, మేలో ఇది 15%కి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 17.2% నుంచి 17.9%కి, గ్రామీణ ప్రాంతాల్లో 12.3% నుంచి 13.7%కి పెరిగింది. వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గి, గ్రామీణ యువతలో ఇది మేలో 16.3%కి చేరింది.