తొక్కిసలాట ఘటనపై నివేదిక కోరిన కేంద్ర హోం శాఖ

తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. ఈ దుర్ఘటనపై తక్షణమే నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ రవికి ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్