నరేంద్ర మోదీ బయోపిక్‌ను నిర్మిస్తున్నట్లు సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ తెలిపింది. ఇందులో ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ మోదీ పాత్రను పోషిస్తున్నారని తాజాగా వెల్లడించింది. 'మా వందే' పేరును ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మూవీకి సి.హెచ్. క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నామని అన్నారు.