నేపాల్‌లో జరుగుతున్న అల్లర్లలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ మృతి చెందింది. అల్లరి మూకల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అల్లరి మూకలు దాడికి పాల్పడుతున్న క్రమంలో తప్పించుకునేందుకు గజియాబాద్‌కు చెందిన మహిళ హోటల్ భవనంపై నుంచి దూకడంతో మృతి చెందింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్కడి పౌరులు చేస్తున్న నిరసనలు తీవ్ర స్థాయికి చేరకున్నాయి.