సుప్రీంకోర్టులో తీవ్ర కలకలం.. సీజేఐపై దాడికి యత్నం

సుప్రీంకోర్టులో ఆకస్మిక ఘటన తీవ్ర కలకలం రేపింది. సీజేఐ జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నించారు. ఓ కేసు విచారణ సమయంలో లాయర్ కిషోర్ రాకేశ్ షూ విసిరేందుకు యత్నించారు. దీంతో తోటి లాయర్లు అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని విస్మరిస్తే సహించబోమని లాయర్ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాయర్ కిషోర్ రాకేష్‌ను అరెస్ట్ చేశారు. కాగా ఇలాంటి చర్యలు నాపై ప్రభావం చూపలేవని సీజేఐ జస్టిస్ గవాయ్ అన్నారు.

సంబంధిత పోస్ట్