బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రసంస్థలుగా గుర్తించాలని పాక్, చైనా కలిసి యూఎన్ భద్రతా మండలిలో చేసిన ప్రతిపాదనను అమెరికా, యూకే, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. వాటి దగ్గర తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశాయి. అయితే, బీఎల్‌ఏను 2019లోనే స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన అమెరికా, ఇటీవల మజీద్ బ్రిగేడ్‌ను కూడా ఆ జాబితాలో భాగమని ప్రకటించింది.