అమెరికాలోని 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వీసా నిబంధనల ఉల్లంఘనలు, నేరాలు, ఉగ్రవాద చర్యలు లేదా వీసా కాలపరిమితి మించి నివసించడం వంటి అంశాలను గుర్తించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. ప్రజాభద్రతకు భంగం కలిగిస్తే వారిని స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగానే ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది.