TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పవన్ కళ్యాణ్ మూవీ 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షంలోనే హీరో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ఈవెంట్‌కు భారీగా హాజరైన అభిమానులు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' చిత్రం ఈనెల 25న విడుదల కానున్న విషయం తెలిసిందే.