ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉపరాష్ట్రపతి కార్యాలయం కేవలం రాజకీయ సంస్థ కాదు. అక్కడ కూర్చొనే వ్యక్తికి న్యాయమూర్తి లక్షణాలు అవసరం. నిష్పక్షపాతం, వివేకం, మాటలు, చేతల్లో న్యాయం వంటి లక్షణాలు ఉండాలి. మరోవైపు దేశంలో నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే’ అని పేర్కొన్నారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది.