ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేశారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. అనంతరం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవగా, రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఏజెంట్లుగా కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రామ్ మోహన్ నాయుడు, శ్రీకాంత్ షిండే వ్యవహరిస్తున్నారు. మొత్తం 781 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.