ఉప రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం జరగనున్న ఈ ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా పాల్గొననున్నారు. పాలక ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67), విపక్ష ఇండీ కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి (79) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఎంపీలు ఓట్లు సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రెండు కూటములూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.