భారత జావెలిన్ సూపర్‌స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నిరాశపరిచాడు. గురువారం జరిగిన ఫైనల్‌లో 12మంది పోటీపడగా నీరజ్ 84.03M విసిరి ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు. కాగా, మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ అంచనాలకు మించి రాణించి ఉత్తమంగా 86.27M త్రో విసిరి మొత్తంమీద నాలుగో స్థానంలో నిలిచాడు. కెషోర్న్ వాల్కాట్(ట్రినిడాడ్ & టొబాగో, 88.16M) స్వర్ణం, అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా, 87.38 మీ) రజతం సాధించారు.