నేపాల్‌లో అల్లర్లు ముదురుతున్న వేళ, కొద్ది నెలల క్రితం అవినీతికి వ్యతిరేకంగా 'యువత మేలుకో' అంటూ పిలుపునిచ్చిన ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వార్థపరులైన నేతల అవినీతి వల్ల యువత భవిష్యత్తు చీకట్లో మునిగిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, “మేలుకో యువత.. మనమే మార్పుకు టార్చ్‌బేరర్స్” అని చేసిన పవర్‌ఫుల్ స్పీచ్ ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతోంది.