పంజాబ్‌లో జలంధర్-లుథియానా రహదారిపై ఓ మహిళ ధైర్యంగా దొంగలను ఎదుర్కొని తప్పించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిల్లౌర్‌కు వెళ్ళే ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు దుండగులు ఆమెను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. ఆమె ఆటో నుంచి బయటకి బయటకు వేలాడుతూ సాయం కోసం అరవడంతో వెనుక కారులో ఉన్న యువకులు దొంగలను వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు అరెస్ట్ కాగా, ఒకరు పరారయ్యారు. మహిళ ధైర్యానికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.