VIDEO: మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు

AP: శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం(M) మండపల్లిలో పిల్లనిచ్చిన మామను అల్లుడు సోమవారం హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగయ్య (58) ను అల్లుడు దాసు కత్తితో పొడిచి హత్య చేశాడు. పనుల నిమిత్తం సైకిల్తో వెళ్తుండగా దారి కాచి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్