VIDEO: అనుమానించిన భార్య.. డిప్యూటీ తహసీల్దార్ సూసైడ్

యూపీలోని బిజ్నోర్‌లో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌కుమార్ (40) ప్రభుత్వ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియా కథనాల ప్రకారం.. అతనికి వేరే మహిళతో సంబంధం ఉందని అతని భార్య అంచల్ అనుమానించింది. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్ బుధవారం ఉదయం తన అధికారిక నివాసంలో లైసెన్స్ గల తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్