TG: హైదరాబాద్‌లోని వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్ వద్ద అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. దారి ఇవ్వాలని అడిగినందుకు, మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు దుండగులు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. అంబులెన్స్‌లో బాలింత ఉన్నారని చెప్పినా వినకుండా, దాదాపు అరగంట పాటు నడిరోడ్డుపై గొడవ చేశారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు నిందితులు ప్రశాంత్, అఖిల్‌లను పోలీసులు అరెస్టు చేశారు.