టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తమిళగ వెట్రి కళగం పార్టీ (టీవీకే) 2026 అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్, నటుడు దళపతి విజయ్‌ను అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన 'టీవీకే స్పెషల్ జనరల్ కౌన్సిల్ మీటింగ్'లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, విజయ్ సొంత పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

సంబంధిత పోస్ట్