తమిళ స్టార్ దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత సంక్షోభంలో ఉన్నారు. తన చివరి సినిమా ‘జన నాయకన్’ను జనవరి 9, 2026న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించినా, ఇప్పుడు ఆ తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ సభలో జరిగిన స్టాంపీడ్ ఘటనతో విజయ్ తీవ్రంగా కలత చెంది, ప్రమోషన్‌లను నిలిపివేశారు. తమిళనాడు ప్రభుత్వంతో వివాదం కూడా ఉధృతమవడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.