బోనాల పండుగ రోజు పాత కక్షలతో దాడి చేసిన ఘటన మహమ్మదాబాద్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. SI శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. గండీడ్ మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో బోనాల పండుగ జరుగుతున్న సందర్భంగా పాత కక్షలను మనసులో పెట్టుకుని కోస్గి సీనయ్య, తన కుటుంబ సభ్యులపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.