వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామంలో 273 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి 40 ఫీటర్ల రోడ్ నిర్మించారని గ్రామస్తులు మరియు సంఘాల నాయకులు తెలిపారు. తహసీల్దార్‌ను అప్రమత్తం చేసినా స్పందించకపోవడంతో, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో వారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు వినతిపత్రం అందజేశారు.