రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం మహిళా దొంగల గ్యాంగ్ హల్చల్ చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆటోలో వచ్చిన ఐదుగురు మహిళలు దొంగతనానికి యత్నించారు. అయితే ఆ ఇంటి వద్ద ఏం దొరకకపోవడంతో, మరో ఇంటిని పరిశీలించి సదరు మహిళలు అక్కడినుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.