ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో, ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి పోలీసులు బారికేడ్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొడంగల్ పట్టణంలో నిఘా పెంచి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.