రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడం హృదయ విదారకమని వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఈ దురదృష్టకర సంఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.