తాండూరు మండలం సంగం కలాన్ గ్రామస్థులు ఆదివారం చెట్టినాడుసిమెంట్ కర్మాగారానికి వెళుతున్న గూడ్స్ రైలును అడ్డుకున్నారు. కర్మాగారానికి గ్రామ శివారు నుంచి రైలు మార్గం నిర్మించడంతోనే వరద ప్రవహించే వీల్లేకుండా పోయిందని, దీనివల్ల వరదనీరు ఇళ్లలోకి చేరి నిత్యవసర సరకులు, సామగ్రి తడిసిపోయి తాము ఇబ్బందులు పడ్డామని గ్రామస్థులు తెలిపారు. కంది, పత్తి పంట పొలాలు నీట మునిగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.