గణేష్ ఉత్సవాలకు ఊరువాడా సిద్ధమౌతోంది. గల్లీ గల్లీలో గణేశున్ని ప్రతిష్టించేందుకు స్థానికులంతా ఒక్కటై చకచకా పనులు చేసుకుంటున్నారు. వినాయక మండప ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వినాయక వ్రతాన్ని మనసా, వాచా, కర్మాణా ఆచరించేందుకు ఇంటిల్లిపాది సిద్ధమౌతున్నారు. తమ పూజ గదిని ప్రత్యేకంగా అలంకరించుకొని గణపయ్యను నవరాత్రులు పూజ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. 'గణపయ్యా.. భూలోకాని రావయ్యా' అంటూ వేడుకుంటున్నారు.