TG: హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనోత్సవాలతో రోడ్లన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా గణనాథుల నిమజ్జనాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్రమంలో బ్యాండ్ చప్పుళ్లకు హుషారైన స్టెప్పులు వేస్తూ యువతీయువకులు సందడి చేస్తున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ సంతోషంగా గడిపారు. అటు ట్యాంక్ బండ్ పరిసరాలకు భారీగా భక్తులు తరలివచ్చారు.