TG: రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య శాఖలో పనిచేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సోమవారం వాణిజ్య పన్నులశాఖ అద్దె వాహనాల డ్రైవర్ల సంఘం నాయకులు రాజు, రాంబాబుల ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వరకు జరిగిన డ్రైవర్ల గర్జన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.