వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ - జూబ్లీహిల్స్ లో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, టిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్, ఆర్టిఏ మెంబర్ జాంగిర్, ఓ బి సి పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.