రైలులో కింది బెర్తు కావాలా?.. అయితే ఇలా చేయండి!

రైల్లో వృద్ధులు, గర్భిణులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు సౌకర్యంగా ప్రయాణించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కోటా కల్పించింది. టికెట్‌ బుకింగ్‌ సమయంలో “లోయర్‌ బెర్త్‌ కోటా” ఆప్షన్‌ ఎంచుకుంటే, 60 ఏళ్లు దాటిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు కింది బెర్త్‌ కేటాయిస్తారు. స్లీపర్‌ క్లాస్‌లో అయితే ప్రతి కోచ్‌లో ఆరు నుంచి ఏడు లోయర్‌ బెర్త్‌లు,
ఏసీ త్రీటైర్‌లో అయితే నాలుగు నుంచి ఐదు లోయర్‌ బెర్తులు ఉంటాయి.

సంబంధిత పోస్ట్