పాక్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. శనివారం రాత్రి ఇరుదేశాలు బుల్లెట్ల వర్షం కురిపించాయి. పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ బీకర కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులు మరణించారని అఫ్గాన్ చెబుతోంది. మరోవైపు తమ సైన్యం జరిపిన దాడిలో పలువురు అఫ్గాన్ సైనికులు మృతి చెందారని పాక్ మీడియా వెల్లడించింది.