ఏబీవీపీ గెలుపు సంబరాలు

చిట్యాల నగర కార్యదర్శి ముష్కే అజయ్ ఆధ్వర్యంలో ఢిల్లీ, HCU లో ABVP గెలుపు సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో కమ్యూనిస్టులకు, కుల తత్వ సంఘాలకు స్థానం లేదని, విద్యార్థులు జాతీయవాదం వైపు నడుస్తూ ABVP ని గెలిపిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని, కానీ యువత దేశభక్తితో ABVP వైపు ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం HCU భూములను అమ్ముకోవాలని చూస్తే విద్యార్థులు ఓటుతో బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BJP మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్