భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వదిలారు. స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి, అభిషేకాలు, విశేష పూజలు చేశారు.