కాళేశ్వరంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఉదయాన్నే కాళేశ్వరం చేరుకున్న భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్ల వద్ద లక్ష వత్తుల దీపాలు, ముగ్గులు వేసి అర్చకులకు దీప దానాలు చేశారు.

సంబంధిత పోస్ట్