నేటినుంచి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర

రెండో తిరుపతిగా పేరుగాంచిన రేగొండ తిరుమలగిరి శివారు బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రకృతి అందాల నడుమ కొండ గుహలో కొలువైన వెంకన్న స్వామి జాతరకు ఉమ్మడి వరంగల్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ జాతరను ఏటా కార్తీక మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. బుగులోని గుట్టలకు ఆనుకొని ఉన్న పురాతన చరిత్ర కలిగిన పాండవుల గుట్టలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్