దాతృత్వాన్ని చాటుకున్న మరిపెడ సీఐ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాంపురం పాఠశాల విద్యార్థులకు సీఐ రాజకుమార్ గౌడ్ సోమవారం షూస్ పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్నారు. విద్యార్థులు షూస్ లేకుండా బడికి వస్తున్నారని తెలుసుకున్న సీఐ, తన సొంత ఖర్చులతో 130 మందికి కొత్త షూస్ అందజేశారు. ఈ గొప్ప పనికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్