మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం ట్రస్మా ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా జరిగాయి. కబడ్డీ, కోకో విభాగాల్లో జూనియర్, సీనియర్ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో ఆరు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీదేవి, ట్రస్మా అధ్యక్షులు సింగరపు యాకయ్య తదితరులు హాజరయ్యారు.