రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ₹8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం మరిపెడలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్ద ఆందోళన చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లేకపోవడంతో, ఎస్ఎఫ్ఐ నాయకులు తమ వినతి పత్రాన్ని ఆఫీస్ గేటుకు అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.