బ్రిడ్జిలు నిర్మించాలని జనగామ కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన

జనగామ జిల్లా చీటకోడూరు, గానుగుపాడు బ్రిడ్జిల నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్ ఎదుట సోమవారం యువకుడు వినూత్న నిరసన చేపట్టారు. చీటకోడూరు గ్రామానికి చెందిన యువకుడు శీర్షాసనం వేసి, ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిల నిర్మాణానికి అధికారులను వేడుకున్నాడు. చీటకోడూరు బ్రిడ్జి కూలిపోయే ప్రమాదంలో ఉందని, దీనిపై కలెక్టర్ స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్కు వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్