జనగామ మండలం చీటకోడూరు వాగు వద్ద ఆదివారం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వాగుపై వంతెనను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిరసన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా రోడ్ డ్యాం ధ్వంసమైన కూడా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో రాకపోకలకు అంతరాయం, ఇబ్బందులు పడుతున్నారు. వాగు పై వంతెన నిర్మించకపోతే స్థానిక సంస్థలు ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.