కళ్లెం గ్రామంలో చెరువులో పడి వ్యక్తి మృతి

లింగాల ఘణ పురం మండలంలోని కళ్లెం గ్రామంలో తాటిపాముల రవీందర్ (38) అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రవీందర్, నోము పండుగ కోసం స్వగ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం బహిర్భూమి కోసం చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెంది ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్