గూడ్స్ వెహికల్స్ లో మనుషులను రవాణా చేయకూడదు: అధికారులు

జనగామ జిల్లా రవాణా శాఖ అధికారులు సోమవారం మాట్లాడుతూ, ఆటోలలో పరిమితికి మించి మనుషులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడ్స్ వెహికల్స్ లో మనుషులను రవాణా చేయకూడదని, లారీలు, టిప్పర్లలో లోడు రవాణా చేస్తున్నప్పుడు టార్పాలిన్ కవర్ లేదా ఏదైనా దళసరి బట్టతో కప్పి ఉంచాలని సూచించారు. పరిమితికి మించి లోడు రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు అతిక్రమించవద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్